నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్సకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆఫీసర్ . ఇప్పటికి ఒక టీజర్ , ట్రైలర్ , వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో అంచనాలు పెంచుతున్నాయి .తాజాగా “గన్ ఎక్ష్పీరియన్స్ ఆఫీసర్ సౌండ్” పేరుతో మరో వీడియోను రిలీజ్ చేశారు వర్మ . ఈ వీడియోలో గన్ పట్టుకొని నాగ్ ఏదో వెతుకుతుండగా.. పక్క నుండి చిన్న పిల్లల ఏడుపు శబ్దం, పిల్లి అరుపులు వినపడటంతో నాగ్ కొంచెం టెన్షన్ పడుతూ కనిపించాడు. ఇందులో వర్మ మార్క్‌ స్పష్టంగా కన్పిస్తోంది. ఇక ఈ నెల 28వ తేదీన జరగబోయే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు నాగ్ అభిమానులందరికీ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఈ ‘ఆఫీసర్’ని థియేటర్లలోకి రానుంది .

 

https://youtu.be/oNcawX-TYrg

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments