విహన్ పటేల్ (27) ముంబై కు చెందిన్ వ్యక్తి . జీవనోపాధి కొరకు టాక్సీ డ్రైవర్ గా మారాడు . అతడు అందంగా లేకపోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు . ఒక రోజు అనుకోకుండా అతని దశ తిరిగింది . గ్రాండ్ మొండియల్ క్యాసినోలో అతడు ఆడిన ఆట 9,43,49,014 రూపాయల ప్రైజ్ కు విజేతను చేసింది . ఇక్కడే అతని జీవితం లో అసలైన ట్విస్ట్ , మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ముంబై కి చెందిన 23 ఏళ్ల మిరా ఖాత్రి అనే మోడల్ తెలుసుకుంది . అదృష్టవంతుడిని పెళ్ళాడాలని నిర్ణయించుకున్న ఆమె విహాన్ ఇంటికి చేరుకొని పెళ్ళాడతానంది . అంత అందగత్తె వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎవరైనా కాదంటారా ? దాంతో విహాన్ కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒప్పుకోవడం , పెళ్లి జరిగిపోవడం అయ్యిపోయింది .

ఓ ట్యాక్సీ డ్రైవర్ ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని తాను అనుకునేవాడినని విహాన్ తెలిపాడు. ఒకవేళ మిరాఖాత్రి డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నా ఫర్వాలేదని, తాను మాత్రం జీవించి ఉన్నంత వరకు ఆమెను ప్రేమిస్తూనే ఉంటానన్నాడు. ‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్దలు ఊరకనే అనలేదు మరి!.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments