యుగపురుషుడు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తానని నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసినదే . ఈ సినిమాకు సంబంధించి ముహూర్త కార్యక్రమం దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా రామకృష్ణ స్టూడియో లో జరగడం , చిత్రీకరణ మొదలవ్వకముందే దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడం చకచకా జరిగిపోయాయి . ఈ సినిమా దర్శకత్వం పై అనేక వార్తలు వచ్చాయి , ఒకానొక దశలో బాలకృష్ణ నే స్వయంగా దర్శకత్వ భాద్యతలు స్వీకరిస్తారని కూడా వార్తలు వినపడ్డాయి . ఇప్పుడు ఈ సందిగ్ధానికి తెరదించుతూ ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ దర్శకత్వం వహిస్తారని బాలకృష్ణ ప్రకటించారు .

ఈ విషయమై దర్శకులు క్రిష్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ “నన్ను నమ్మి ఇంత బాధ్యత అప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు . ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు . ప్రపంచంలోని తెలుగువాళ్ళందరి అభిమానానికి , ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత . మనసా వాచా కర్మణా నిర్వహిస్తానని మాటిస్తున్నాను” అని పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments