జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 20 వ తారీఖు నుండి పోరాట యాత్ర మొదలు పెట్టి నాలుగు రోజులు పోరాట యాత్ర కొనసాగించిన తరువాత తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి గాయాలు అవ్వడంతో రెండు రోజుల పాటు విరామం తీసుకున్న విషయం తీసుకున్నారు . శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఒక రోజు పాటు ఉద్దానం కిడ్నీ బాదితుల విషయంలో ప్రభుత్వ వైఖరి మారడం కోసం నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసినదే .

ఈరోజు ఆదివారం పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర ను కొనసాగించనున్నారు . మధ్యాహ్నం 1 గంటకు పోరాట యాత్ర మొదలు పెట్టి మధ్యాహ్నం 2 గంటలకు నరసన్నపేట లో బహిరంగ సభలో మాట్లాడనున్నారు , అనంతరం అక్కడ నుండి బయలుదేరి నిరసన కవాతు చేపడుతూ సాయంత్రం 4 గంటలకు పాతపట్నం చేరుకొని అక్కడ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు . సభ అనంతరం పాతపట్నం నుండి బయల్దేరి ఆముదాలవలస చేరుకొని పవన్ బహిరంగ సభలో ప్రసంగంచించనున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments