ఎన్ని రకాల సంబంధాలు ఉన్నా రక్త సంబంధంకు ఉన్న ప్రత్యేకత వేరు . ఈ సంఘటన దీనికి సరైన నిదర్శనం . ఎవరైనా పిల్లలు తప్పిపోతే ఇక దొరకడం చాలా అరుదు , కానీ ఇక్కడ అలా లేదు . విషయానికి వస్తే చైనా లో లీ ఘంజీ అనే వ్యక్తి తన తప్పిపోయిన కొడుకు కోసం 24 ఏళ్లగా అన్వేషించి చివరికి తన కొడుకును కలుసుకున్నాడు . 1994 , ఆగష్టు 8 న మూడేళ్ళ కుమారుడిని కోల్పోయిన అతను చైనా అంతటా 1,80,000 అదృశ్య ప్రకటనలు ఇచ్చాడు .

తల్లితండ్రుల నుండి విడిపోయిన తరువాత తప్పిపోయిన పిల్లాడు లీ లీ ను ఓ జంట చేరదీసి అతడిని తన తల్లితండ్రులకు అప్పగించాలని చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో వారే పెంచి పెద్ద చేశారు . కాని విధి మళ్ళీ తండ్రి కొడుకులను దగ్గర చేసింది . . స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న తప్పిపోయిన పిల్లల డీఎన్ఏ డేటాబేస్ తో అతడిని గుర్తించారు . తరువాత తండ్రీ కొడుకులకు డీఎన్ఏ పరీక్షలు చేయటం ద్వారా పోలీసులు నిర్ధారించారు . ఎట్టకేలకు తండ్రి ప్రయత్నం ఫలించి దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం కుమారుడిని కలుసుకోగలిగారు .

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments