కర్ణాటక లో జీడీఎస్ – కాంగ్రెస్ కూటమి గురుంచి అనేకమంది అనేక రకాలుగా మాట్లాడుతున్న విషయం తెలిసినదే . ఈ విషయం పై మాజీ ప్రధాని , జేడీఎస్ అధ్యక్షులు హెచ్ డీ దేవెగౌడ సోమవారం రాజరాజేశ్వరీ నగర్ కు జరిగే ఎన్నిక కోసం ప్రచార కార్యక్రమంలో సంచలన వ్యాఖలు చేశారు . ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తో తమ పొత్తు కేవలం విధాన సాధనకు మాత్రమె పరిమితి అన్నారు . రాజరాజేశ్వరీ నగర్ స్థానానికి జరిగే ఎన్నికలలో తమ అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు .
కాంగ్రెస్‌తో పొత్తు విధాన సాధన వరకే పరిమితమని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ స్థానం నుంచి జేడీఎస్ తరపున రామచంద్రప్ప బరిలో ఉన్నారు. దేవెగౌడ తన రోడ్‌షోలో ముఖ్యమంత్రి కుమారస్వామి పేరు ప్రస్తావిస్తూ రామచంద్రప్పను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మునిరత్న కూడా కుమారస్వామి పేరు చెప్పి ఓట్లు అడగడం విశేషం. బీజేపీ తరపున పోటీలో ఉన్న మునిరాజు గౌడ కోసం మాజీ ముఖ్యమంత్రి యడ్యూర్ప ప్రచారం నిర్వహించారు.