విజయవాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రతినిధుల సమోదుతో ప్రారంభమైంది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తన నివాసం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వినూత్న రీతిలో బయలుదేరారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య మోటార్ సైకిల్ ఎక్కిన చంద్రబాబు, భారీ ర్యాలీగా మహానాడు ప్రాంగణానికి బయలుదేరారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను చంద్రబాబు నడపడం గమనార్హం. ర్యాలీలో ఇవే తరహా బైకులు అధికం కనిపిస్తున్నాయి. ర్యాలీలో టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వీరిని అనుసరిస్తూ, వందలాది మంది టీడీపీ కార్యకర్తలు మహానాడు స్థలికి తరలివెళ్లారు.
మహానాడు కు వినూత్న రీతి లో చంద్రబాబు!
Subscribe
Login
0 Comments