నాగశౌర్య కు హీరో గా విజయం తెచ్చిపెట్టిన సినిమా ఊహలు గుసగుసలాడే . ఆ చిత్రానికి దర్శకుడు అవసరాల శ్రీనివాస్ . ఈ సినిమాతో అవసరాల కూడా దర్శకుడిగా మంచి పేరు సంపాయించుకున్నారు . తరువాత నారా రోహిత్ , నాగ శౌర్యలతో జ్యో అచ్యుతానంద సినిమా తెరకెక్కించారు అవసరాల . ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది .

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అవసరాల , నాగశౌర్య కాంబినేషన్లో మరొక సినిమా తెరకెక్కనుంది . ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది . ఈ సినిమాకు నిర్మాతగా వారాహి సంస్థ వ్యవహరించబోతునట్లు సమాచారం . కాని ఈ విషయంపై దర్శక నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments