మహానటి సినిమా హిట్ అవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్ర యూనిట్ ను సత్కరించారు . ఈ సందర్భంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం అనాలా ? బావగారు అనాలా తెలియడం లేదన్నారు . ఎందుకంటే ఆ కుటుంబంతో అంత అనుబంధం ఉందని , నారా భువనేశ్వరిని అక్కా అని పిలిచేదానని అన్నారు . అమ్మ సావిత్రి పుట్టిన ఊరిలో ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు . అమ్మ పేరు పై సినిమా తీసి ఘనంగా సత్కరించడం పట్ల చాలా గర్వపడుతున్నాని తెలిపారు . అమ్మ పాత్రని కీర్తి సురేష్ బాగా చేసారని , అమ్మను చూడాలనిపించినప్పుడు తననే చూస్తానని కీర్తి సురేష్ తో అన్నానని చెప్పారు .
సీఎం గారు అనాలా … బావగారు అనాలా
Subscribe
Login
0 Comments