నిన్న జరిగిన కీలక క్వాలిఫయర్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తో కూడా అదరగొట్టిన సన్‌రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలు సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా హీరో సాయిధరమ్ తేజ్ లు రషీద్ ఖాన్ కి సెల్యూట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి సమాధానంగా రషీద్.. వారి సినిమాలు చాలా బాగుంటాయని తెలుపుతూ ధన్యవాదాలు కూడా తెలిపాడు. కాగా రషీద్ ఖాన్ నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్‌లో కేవలం 10 బంతుల్లో 34 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ జట్టు కప్పు కోసం రేపు చెన్నైని ఢీకొనబోతోంది.
Thank you bro 🙌🏻🙌🏻 watching your movies keenly 😊
— Rashid Khan (@rashidkhan_19) May 25, 2018
#SRH Through to the finals of this years edition of IPL 2018 #IPL2018Qualifier @rashidkhan_19 you beauty….. @SunRisers congratulations pic.twitter.com/mplA0lUnUE
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 25, 2018