ఆఫీసర్‌ ప్రీ రిలీజ్‌ వేడుకకు స్టార్‌ డైరెక్టర్‌

0
282

వివాదాస్పద దర్శకులు  రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆఫీసర్‌. చాలా కాలం తరువాత కింగ్‌ నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  సినిమా కావటంతో ఆఫీసర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా వర్మ కూడా జాగ్రత్త సినిమా చేశానని చెపుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్‌ ఈ నెల 28న ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు రంగస్థలం సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన స్టార్‌ డైరెక్టర్ సుకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here