తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జూన్ 2న అదిరిపోయేలా నిర్వహించడానికి జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ ఆదేశించారు. రాష్ట్ర అవతర వేడుకలపై శుక్రవారం వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడారు.
గతంలో నిర్వహించిన మాదిరిగానే జిల్లా స్థాయిలో పలు రంగాల్లో విశిష్ట సేవలు ఆందించిన ప్రముఖులకు రూ. 51,116లు నగదు పురస్కారాలు అందించాలని, అమరవీరులకు నివాళులు అర్పించాలని, పెద్ద ఎత్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చేపాట్టాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉత్సవాలకు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.