ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో శిఖర్‌ ధావన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో నాలుగు వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ధావన్‌ చేరిపోయాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌(34) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా ధావన్‌ గుర్తింపు సాధించాడు.

ప్రస్తుతం ధావన్‌ 4,032 పరుగులతో కొనసాగుతున్నాడు అతని కంటే ముందు నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో సురేశ్‌ రైనా(4,953), కోహ్లి(4,948), రోహిత్‌ శర్మ(4,493), గౌతం గంభీర్‌(4,217), రాబిన్‌ ఉతప్ప(4,129), ఎంఎస్‌ ధోని(4,016), డేవిడ్‌ వార్నర్‌(4,014)లు ఉన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments