తాను నటించిన ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మ.. మంగమ్మ’ పాటలో సమంత ఒలకబోసిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. ఈ పాటకు చాలా మంది కాలేజీ అమ్మాయిలు కూడా తమదైన శైలిలో డ్యాన్సులు చేస్తూ, ఆ పాటను పాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే, సమంతకు ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా నచ్చేసింది.

ట్విట్టర్‌లో సమంత అభిమాని ఒకరు తన తాతయ్య పాడిన ‘రంగమ్మ.. మంగమ‍్మ’ పాటను పోస్ట్ చేశాడు. సమంత పాట ఎంతో పాప్యులర్‌ అయిందని, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఆ పాట పాడుకుంటున్నారని తెలిపాడు. తాతయ్య రాకింగ్ అని ఆ పాట ఇచ్చినందుకు కృతజ్ఞతలని పేర్కొన్నాడు. రంగమ్మ మంగమ్మ అంటూ ఆ తాతయ్య పాడుతోన్న పాట అందరినీ అలరిస్తోంది. సమంతకు అయితే మరీ బాగా నచ్చేయడంతో ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసి, ‘మేడ్‌ మై డే’ అని పేర్కొంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments