నేనే స్పీడు తగ్గించా …

632

కెరీర్ ఆరంభంలోనే వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు హీరో రాజ్ తరుణ్ . ఈ మధ్య ఆయన సినిమా వచ్చి చాలా కాలమైంది . ఆయన తాజా సినిమా రాజుగాడు . ఈ చిత్రం జూన్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఈ సినిమాలో దొంగతనం చేయడమనే బలహీనత కలిగిన రాజు అనే పాత్రలో తాను కనిస్పిస్తానన్నారు . ఈ సినిమాకి సంబందించిన వినోదమంతా ఈ పాయింట్ పైనే ఆధారపడి ఉంటుందన్నారు . ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమైరా దస్తూర్ కి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నానన్నారు . ఇంకా మాట్లాడుతూ తనకు ఇంతకముందు లాగే అవకాశాలు వస్తున్నాయని ఒక సినిమా పూర్తయిన తరువాతనే మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు . అందువల్లనే తన దూకుడు తగ్గినట్టుగా అనిపిస్తోంది తప్ప వేరే కారణం ఏమి లేదన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here