రష్యాకు 2024లో మళ్లీ ప్రధానిని అవుతానంటూ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంకేతాలిచ్చారు. రష్యాలో ఓ వ్యక్తి అధ్యక్షుడిగా వరుసగా రెండు పర్యాయాలకంటే ఎక్కువ కాలం కొనసాగకూడదు. 2008 నాటికి పుతిన్‌ వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేయడంతో ఓసారి ప్రధాన మంత్రిగా ఉండి మళ్లీ 2013లో మూడోసారి అధ్యక్షుడయ్యారు. ఇటీవలి ఎన్నికల్లోనూ గెలుపొంది ప్రస్తుతం నాలుగోసారి ఆ పదవిలో ఉన్నారు. 2024లో ఆయన పదవీకాలం ముగుస్తోంది. ‘నేను రాజ్యాంగంలోని నిబంధనలను ఎల్లప్పుడూ విధిగా పాటిస్తాను. గతంలో ఓ సారి అధ్యక్ష పదవిని వదిలేసి ప్రధానిగా చేశాను. ఇప్పుడు కూడా నిబంధనలు పాటించాలని అనుకుంటున్నాను’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments