జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దనం కిడ్నీ బాదితుల కోసం తలపెట్టిన నిరాహార దీక్ష ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉద్దనం బాధిత కుటుంబ సబ్యుడు  నిమ్మరసం తాగి పవన్ దీక్ష విరమింపజేశారు  . ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను రాజకీయ గుర్తింపు కోసం ముఖ్యమంత్రితో పోరాడడం లేదని , ఒకవేళ అలా అయితే 2014 ఎన్నికలలో తాను తెలుగుదేశంకు ఎందుకు మద్దతిస్తానన్నారు . శ్రీకాకుళానికి 196 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉందన్నారు . ఆ ప్రాంతం మరో కేరళ లాగా పర్యాటక ప్రాంతం అన్నారు  . 2 వేల కోట్లు కర్చు పెట్టి పుష్కరాలు నిర్వహిస్తారు కాని ఉద్దనంలో మాత్రం ఖర్చు చేయలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .  రాష్ట్రం అభివృద్ధి పేరుతో విదేశాలకు వెళ్ళడానికి డబ్బులుంటాయి కాని వ్యాధి గ్రస్తుల విషయంలో మాత్రం ఖర్చు పెట్టడానికి వెనకాడతారన్నారు .

ఇంకా మాట్లాడుతూ పేదల జీవితాలు మాత్రం మారవు కాని నేతలు , వారి కుటుంబ సభ్యులు మరింత పైకి ఎదుగుతున్నారన్నారు . ప్రజలు ఏది పట్టించుకోవటం లేదని అనుకుంటే చాల పొరపాటు అని అన్నారు . అన్యాయం పరాకాష్టకు చేరుకుంటే ప్రజల నుంచి ఉద్యమాలు తప్పవన్నారు . సామాజిక చైతన్యం కోసం జనసేన పోరాటం చేస్తుందన్నారు . దశాబ్దకాలంగా 20 వేల మంది చనిపోతే కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వం సరైన వైద్య సదుపాయం ఏర్పాటు చేయలేక పోయిందని  , నిధులు లేవని అంటున్నారు కాబట్టి అక్కడ డబ్బు ఉన్న పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి వారి సదుపాయాలకు ప్రణాళికలు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు . తాను రెండు రకాలుగా నిరసన తెలియజేసానని , ఆంధ్రప్రజలను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి , వారికి మద్దతు పలికిన తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా అని అన్నారు .

తాము పోయిన ఎన్నికలలో తెలుగుదేశానికి సహకరించి గెలుపును అందిస్తే వారు ఇప్పుడు జనసైనికులపై దాడులు చేయడం తగదన్నారు . దాడులు చేయిస్తే ఎవరు చేతులు కట్టుకు కూర్చోరని హెచ్చరించారు . జిల్లాలో సరైన వైద్య సదుపాయాలూ , సిబ్బంది కూడా లేరన్నారు . అన్నీ పార్టీలు కులాలను విభజిస్తూ పాలన చేస్తున్నారన్నారు . ఇప్పటివరకు 20 వేల మంది కిడ్నీ బాదితులను గుర్తిస్తే అందులో ఎంతమందికి ప్రభుత్వం ఎంతమందికి ఆర్ధిక సహాయం చేస్తోందని , ఎంతమందికి పెన్షన్ ఇస్తోందని పవన్ ప్రశ్నించారు .

జనసేన కు 2019 కు అధికారం వస్తే తప్పకుండా ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు . శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా కాదని , ఇన్ని వసతులు వనరులు ఉన్నా నేతలు తమ ప్రయోజనాల కోసం వెనకకు నేట్టేసారాని పవన్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం వాళ్లు ముందు నుంచి కౌగలించుకొని వెన్నుపోటు పొడిచే రకమన్నారు . మీరు ముందు నుంచి చిరునవ్వు నవ్వుతూ వెనుక నుంచి పోడుస్తానంటే ఊరుకునే వ్యక్తిని కానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments