ఏదైనా సినిమా ఫాప్ అయితే హీరోలు తమ సినిమాలు ఫ్లాప్ అని చెప్పుకోవడానికి ఇష్టపడరు . కాని మన న్యాచురల్ స్టార్ నాని ఆ విషయం లో డిఫరెంట్ . ఆయన తన సినిమా ఫ్లాప్ అని సోషల్ మీడియా ద్వారా ఒప్పుకున్నారు .
నాని నటించిన `కృష్ణార్జున యుద్ధం` సినిమా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చాలా కాలం తర్వాత నాని కెరీర్లో ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఓ వెబ్సైట్ మాత్రం `కృష్ణార్జున యుద్ధం` సినిమాను హిట్‌గా పేర్కొంది. దీనిపై నాని సెటైర్ వేశాడు. `సూపర్‌హిట్ అంట.. అవలేదు బాబాయ్.. ఆడలేదు కూడా.. అయినా మనసు పెట్టి చేశాం.. చూసెయ్యండి` అంటూ సెటైరిక్‌గా స్పందించాడు.
