అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి మరణం అందరినీ షాక్ కు గురి చేసింది . ఆమె మృతి చెంది ఇన్ని రోజులు అవుతున్నా ఆమె స్మృతులు సినీ ప్రముఖులను వెంటాడుతూనే ఉన్నాయి . వర్మ దర్సకత్వంలో రూపొందిన ఆఫీసర్ చిత్రం జూన్ 1 వ తారేఖున విడుదల కానుంది . ఈ చిత్ర ప్రకార కార్యక్రమామలో నాగార్జున పాల్గొన్నారు . ఈ సందర్భంగా నాగార్జున శ్రీదేవి గురుంచి  ప్రస్తావించారు . ఆయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని . ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందన్నారు .

ఇంకా మాట్లాడుతూ శ్రీదేవి మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని , తనకు ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా , వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసిందన్నారు . దక్షిణాది , హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా ఒకే రకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు .

ఈ సందర్భంగా తాను రాంగోపాల్ వర్మ దర్సకత్వంలో శ్రీదేవి తో కలిసి నటించిన గోవిందా గోవిందా చిత్రం గురుంచి ప్రస్తావించారు . ఈ సినిమా షూటింగ్ జరుగుతునప్పుడు కెమెరా ముందు శ్రీదేవి చాలా సంతోషంగా ఉండేవారని  , కెమెరా స్విచ్ ఆఫ్ చేస్తే ఆమె తన నిజజీవితంలోకి వచ్చేసే వారని నాగార్జున పేర్కొన్నారు . తాను నటిస్తున్నంత కాలం శ్రీదేవిని మిస్ అవుతూనే ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments