సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం మహానటి. సినిమా రిలీజై మూడు వారాలు గడుస్తూ ఇప్పటి హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. తాజాగా మహానటి చిత్రయూనిట్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ కార్యక్రమంలో మహానటి సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరిని పేరు పేరునా ప్రశంసించిన చంద్రబాబు, పార్టీ నాయకులను మహానటి సినిమా చూడాలని కోరారు. అవసరమైతే సినిమాకు పన్ను రాయితీ కూడా కల్పిస్తామన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సావిత్రి పాత్రలో అద‍్భుతంగా నటించిన కీర్తి సురేష్‌, దర్శకుడు నాగ అశ్విన్‌, నిర్మాతలు ప్రియాంకా, స్వప్నా దత్‌, వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, కళావెంకట్రావు, కాలవ శ్రీనివాస్‌, మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమార్‌, ఎమ్మెల్యేలు రాజేంద్ర ప్రసాద్‌, వల్లభనేని వంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్‌ తరుపున నిర్మాతలు రాజధాని నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు ప్రకటించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments