నాకు చాలా గర్వంగా ఉంది …

843

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి . ఈ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది . ఈరోజు ఈ చిత్రబృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను గుంటూరులో కలుసుకున్నారు . చంద్రబాబు చిత్రబృందాన్ని సత్కరించారు . ఈ కార్యక్రమం లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ మాట్లాడుతూ తనకు ఈ విధంగా ముఖ్యమంత్రిని కలిసి ఆయన చేత సత్కరించబడడం చాలా గర్వంగా  ఉందన్నారు . ఈ అవకాశాన్ని కలిపించిన చిత్రబృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు . సావిత్రిగారు మనకొక ఆస్తి లాంటి వారిని ఆమెను తిరిగి తెరపై తీసుకురావడానికి తామంతా ప్రయత్నించామని . మహానటి టీం మొత్తం తనకు బాగా సపోర్ట్ చేశారని , ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ గా థాంక్స్ చెప్పాలనుకుంటున్నానని  కీర్తి సురేష్  తెలిపారు  .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here