గజల్ శ్రీనివాస్‌ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కృష్ణానగర్‌కు చెందిన ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఆమె ఫిర్యాదుతో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లు జ్యుడీషియల్ రిమాండ్ లో కూడా ఉన్న విషయం తెలిసినదే  .  గజల్ శ్రీనివాస్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఓ మహిళ ఫోన్ చేసి తనను బెదిరిస్తోందని బాధిత మహిళ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం..

తాజాగా ఈ కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ నెల 12న బాధిత మహిళకు విజయలక్ష్మి అనే మరో మహిళ ఫోన్ చేసి బెదిరించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో బాధితురాలు మరోమారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న పోలీసులు విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments