జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్దనం కిడ్నీ సమస్యలపై ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే . ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు . ఉద్దానం కిద్నీయ్ బాధితుల కోసం దేశ , విదేశీ వైద్యులు , పరిశోధకులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ , డయాలసిస్ చేపట్టాము . నీటి శుద్ధి , మినరల్ వాటర్ కేంద్రాల ఏర్పాటు పై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు .

మరో ట్వీట్ లో రాష్ట్రంలో ఆక్వా ధరల పతనం , రైతుల సమస్యలపై అధికారులతో సమీక్షించాం . ఆక్వా ఎగుమతుల వాళ్ళ విదేశీ వాణిజ్యం పాడే కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం . ఈ నెల 26 న ఆక్వా రైతులు , ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని నిర్ణయించాం అని చంద్రబాబు తెలిపారు .

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments