మహానటి సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్ సీఎం చంద్రబాబును కలిసింది . చిత్ర యూనిట్ ను చంద్రబాబు సత్కరించారు .  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకొని స్వప్న దత్ , ప్రియాంక దత్ మహానటి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించి చాలా సాహసం చేసారన్నారు . సీఎం మాట్లాడుతూ నాగ్ అశ్విన్ కు ఇది రెండో సినిమా అయినా బాగా తీశారని , చిత్రానికి ముందు ఆయన రెండేళ్ళు అధ్యయనం చేశారని అందుకు తనను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ సావిత్రి పాత్ర చేయడమంటే సాహసమనే చెప్పాలి ఎందుకంటే సావిత్రి సహజ నటని ఆవిడకు ఆవిడే సాటని అన్నారు . ఎన్టీరామారావు స్థానం ఇంకొకరు రీప్లేస్ చేయలేరని  ఎన్టీరామారావు … ఎన్టీరామారావే … సావిత్రి …. సావిత్రేనని అలాంటిడి నటి కీర్తి సురేష్ సావిత్రి పాత్రను చాలా బాగా చేశారని చంద్రబాబు కొనియాడారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments