టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నోరుపారేసుకున్నారు. ఎవరా రమణ దీక్షితులు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనలాంటి వారి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. టీటీడీ అంశాన్ని బజారుకెక్కించాలని ఆయన అనుకుంటున్నారని ఆక్షేపించారు. నాశనమైపోతారు.. చెత్త రాజకీయాలు పక్కనబెట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే రమణ దీక్షితులకు అంత భయం లేకుండా పోతుందా? అని ప్రశ్నించారు. ‘ఎవరా రమణ దీక్షితులు? బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే..?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీక్షితులు ఏమేం తప్పులు చేశారో మొత్తం తమకు తెలుసునని అన్నారు. ‘రమణ దీక్షితులూ.. మీరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. రమణ దీక్షితులూ.. ఎన్నో రోజులు లేవు. అనుభవిస్తారు మీరు. పత్రికల్లో, చానళ్లలో మీరన్న మాటల గురించి వార్తలు చదవాలా?’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments