చంద్రబాబు దయతో మంత్రివి అయ్యావు …

606

తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఉద్దేశించి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసినదే . ఈ విషయం పై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు . రామనదీక్షితులను బొక్కలో వేసి రెండు తగిలిస్తే సరిపోతుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించడం నీచమైన చర్య అని అభివర్ణించారు .

ఎన్నికలలో ఓడిపోయినా సోమిరెడ్డి చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద మంత్రి అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు . చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని టీడీపీ నేతలు ప్రవర్తించడం చట్టాలను ఉల్లంఘించదమేనని అభిప్రాయపడ్డారు . రమణ దీక్షితులు , ఐవైఆర్ కృష్ణారావు లాంటి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పోలీసు కేసులు పెట్టిస్తే తాము సహించమని అన్నారు .

రామనదీక్షితులు పై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు . నల్లబ్యాడ్జీలు ధరించి తిరుమల ఆలయం లోపల నిరసన తెలపడం బాధాకరమని , అధికార పార్టీ రాజకీయాలు చేసి ఆలయంలో ఇలాంటి నిరసనలు చేయించడం దారుణమని మండిపడ్డారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here