వైఎస్ఆర్సీపీ అధినేత వై ఎస్ జగన్ తన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా ఆకివీడు చేరుకుంది . అక్కడ జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ నాలుగేళ్ళుగా చంద్రబాబు తమ నియోజికవర్గానికి చేసిందేమిటని రైతులు , ప్రజలు వాపోతున్నారని అన్నారు . మంచినీళ్ళు దొరకని పరిస్థితి లో ఉన్నామని ప్రజలు చెబుతున్నారన్నారు . మేము తాగుతున్న నీళ్ళు ఇవన్నా అని ప్రజలు బాటిల్స్ తీసుకొచ్చి తనకు చూపిస్తున్నారన్నారు . జగన్ తన చేతిలో ఉన్న బాటిల్ ను చూపిస్తూ “చంద్రబాబు గారు ఈ బాటిల్ లో ఉన్నది చెరుకురసం కాదు , తాగే మంచినీళ్ళు . ఇదే నియోజికవర్గం చుట్టూ నీళ్ళు కనిపిస్తాయి కానీ , తాగడానికి గుక్కెడు నీళ్లుండవు ” అని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ గోదావరి నీళ్లు చూస్తే వర్షాకాలం తప్ప ఎప్పుడు వదిలిపెత్తరన్నారు . బోరులో ఉప్పునీరు , తాగునీటిని కొనుక్కోవలసిన పరిస్థితిలో పేదలు ఉన్నారంటే ఎంత దారుణమని ప్రజలు తరపున చంద్రబాబు గారిని తాను అడుగుతున్నానన్నారు . రాజశేఖరరెడ్డి గారి పాలన రామరాజ్యం కాదా , మీ నాలుగు పాలన రాక్షనపాలన కాదా ? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments