ఈ ఏడాది కూడా ఖైరతాబాద్‌ మహాగణపతిని 60 అడుగుల ఎత్తులోనే తయారు చేస్తామని గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తెలిపారు. సర్వేశాం ఏకాదశి సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు  ఖైరతాబాద్‌ లైబ్రరీ ప్రాంగణంలో  మహాగణపతి తయారీ పనులకు కర్ర పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శుక్రవారం గణపతి నక్షత్రం కావడం విశేషమ ని విఠలశర్మ సిద్ధాంతి తెలిపారు. వ రుసగా 64వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఖైరతాబాద్‌ మహాగణపతి పనులను ఏకాదశి రోజు భూమి, కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గురువారం ఆయన చెప్పారు. ఈ సంవత్సరం వినాయకచవితి సెప్టెంబర్‌ 13న రానుందన్నారు.

భక్తుల కోరిక మేరకే..  
ఖైరతాబాద్‌ మహాగణపతిని భక్తుల కోరిక మేరకు 60 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా తయారు చేయాలని నిర్ణయించామని సుదర్శన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ మహాగణపతిని మట్టితో తయారుచేయడం వల్ల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు అవకాశం ఉండదని, వినాయక పూజల సందర్భంగా 300– 500 కేజీల బరువున్న పూల మాలలను వేయాల్సి వస్తుంది. అంత బరువు వేయడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు,  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోరిక మేరకు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, న్యాచురల్‌ రంగులను ఉపయోగించి మహాగణపతిని తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మట్టితో చేస్తామని చెప్పినా.. అలా చేయలేకపోతున్నామని ఆయన తెలిపారు. మహాగణపతి తయారీ పనుల్లో భాగంగా కర్రపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్‌ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు బల్వంతరావు, హన్మంతరావు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments