మహదేవ్ హీరోగా , మమతా సాహాస్ , సునైన హీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం “నివురు” . ఋషికృష్ణ దర్సకత్వంలో అభిరామ్ నిర్మించ ఈ సినిమా టైటిల్ లోగోను మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా విడుదల చేశారు . ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ హీరో మహదేవ్ చిన్నప్పటి నుండి అందరి హీరోల పేర్లను పచ్చబొట్లు పోదిపించుకున్నారని , అతనికి సినిమాలంటే అంత పిచ్చి అని అన్నారు . ఈ సినిమాలో సంగీతం , ఛాయాగ్రాహణం అద్బుతంగా ఉన్నాయని , సినిమా హిట్ అవ్వాలని శివాజీ రాజా అన్నారు . హీరో మహదేవ్ మాట్లాడుతూ తనకు చదువు పెద్దగా అబ్బాకపోయినా సినిమా మీద ప్యాషన్ తో ఎన్నో కష్టాలకోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు . నిర్మాత అభిరామ్ మాట్లాడుతో తన ఇల్లు అమ్ముకొని , ఆటో తోలుకుంటూ ఈ సినిమాను రూపొందించారని తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలు , నటుడు కాశీ విశ్వనాథ్ , సంగీత దర్శకుడు యం. ఎల్.రాజా పాల్గొన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments