తండ్రి బాటలో తనయుడు …

585

మెగాస్టార్ చిరంజీవి తన విలక్షణమైన నటన ద్వారానే కాకుండా తనకున్న సేవా భావం వల్ల అభిమానులను సంపాదించుకున్నారు . ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంకు , చిరంజీవి ఐబ్యాంక్ మరియు అనేక గుప్త దానాలు చేస్తూ ఆపదలో ఉన్న వారికి చేయందిస్తున్నారు . ఇప్పుడు ఆయన బాటలోనే తనయుడు రాంచరణ్ నడవబోతున్నారు .

త్వరలో తాను  పేదలకు ఉపయోగపడే ఒక ఫౌండేషన్ స్తాపించనున్నట్లు రాంచరణ్ ప్రకటించారు . తనకు వచ్చే పారితోషకంలో 15శాతం వరకు ఈ ట్రస్ట్ కి కేటాయిస్తానని చరణ్ తెలిపారు . తన ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు . గత దశాబ్దకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామని , ఇప్పటి వరకు బయట నుండి ఎలాంటి ఫండ్స్ తీసుకోలేదని , తమకు వస్తున్న పారితోషికంలో కొంత మొత్తాన్ని ఆ ట్రస్ట్ కు కేటాయిస్తున్నామని తెలిపారు . తమ సేవలు మరింత ఎక్కువ మందికి చేరాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరో ఫౌండేషన్ ను స్థాపించబోతున్నట్టు చరణ్ తెలియజేసారు . ఈ ఫౌండేషన్ ను అభిమానులకు అంకితం చేస్తామని , ఈ ఫౌండేషన్ స్థాపన ఆలోచనే తన తండ్రి చిరంజీవిదేనని తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here