జనసేన అధినేత తన పోరాట యాత్ర లో భాగంగా పలాసలో జరిగిన ఉద్దనం కిడ్నీ వ్యాధి గ్రస్తుల సమావేశంలో మాట్లాడుతూ 48 గంటలలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రిని నియమించి కిడ్నీ వ్యాధి గ్రస్తులను శాశ్వత పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకోవాలని లేకపోతే తాను ఉద్దనం కిడ్నీ వ్యాధి గ్రస్తుల డిమాండ్ల కోసం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించిన విషయం తెలిసినదే . అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు .
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాను చెప్పినట్టుగానే పవన్ శ్రీకాకుళంలో తాను బస చేస్తున్న రిసార్ట్ లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిరాహారదీక్షను ప్రారంభించారు . రేపు సాయంత్రం 5 గంటల వరకు అంటే ఒక రోజు పాటు ఈ దీక్ష సాగనుంది . ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమైనా ప్రకటన వెలువడుతుందేమో చూడాలి