జనసేన పోరాట యాత్రలో భాగంగా పలాసలో ఉద్దానం కిడ్నీ బాధితులతో జరిగిన సమావేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కనీసం ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేరని 48 గంటలలో ప్రభుత్వం స్పందించి మంత్రి నియామకం , కిడ్నీ బాధితులను ఆడుకోడానికి సత్వర చర్యలు చేపట్టాలని , ప్రభుత్వం పట్టించుకోని యెడల తాను కిడ్నీ బాదితుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసినదే .

ప్రభుత్వం స్పందించకపోవడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు అనగా మే 25 సాయంత్రం 5 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు తాను బస చేస్తున్న రిసార్ట్ లోనే  దీక్ష చేస్తారని,రేపు అనగా మే 26 వ తారీఖున ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు  ఎన్టీఆర్ గ్రౌండ్ , నరసన్నపేట , శ్రీకాకుళం నందు ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులకు అండగా నిలబడుతూ తక్షణం  ప్రభుత్వం స్పందించవలసినదిగా కోరుతూ పవన్ నిరాహారదీక్ష చేయనున్నారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి పేరిట ప్రకటన వెలువడింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments