టైటిల్ : నేల టిక్కెట్టు
జానర్ : రివేంజ్ డ్రామా
తారాగణం : రవితేజ, మాళవికా శర్మ, జగపతి బాబు, సంపత్, సుబ్బరాజు
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
దర్శకత్వం : కల్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత : రామ్ తళ్లూరి
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజ కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టుగా అలరించలేకపోతున్నాడు. ఇటీవల రాజా ది గ్రేట్ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించినా తరువాత టచ్ చేసి చూడు సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా మాస్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
నటీనటులు ;
సినిమాకు ప్రధాన బలం హీరో రవితేజ. తనదైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, రొమాన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే బలమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. హీరోయిన్గా పరిచయం అయిన మాళవికా శర్మ లుక్స్ పరంగా ఆకట్టుకున్న నటిగా మెప్పించలేకపోయింది. విలన్‌గా జగపతి బాబు మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించారు.ఆలీ, ప్రవీణ్, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్ రెడ్డి, పృథ్వి, ప్రియదర్శి ఇలా తెరనిండా నటీనటులు ఉన్నా ఎవరికీ బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
కథా కథనం
సంగీతం
సినిమా నిడివి
Rating : 2/5