సోషల్ మీడియాలో గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ , ప్యాడ్ మాన్ ఛాలెంజ్ లు ట్రెండ్ అయిన విషయం తెలిసినదే . ఇప్పుడు తాజాగా ఫిట్నెస్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది . ఒలింపిక్ పతక విజేత , కేంద్ర క్రీడా శాఖా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఈ ఛాలెంజ్ ను సోషల్ మీడియా లో ప్రారంబించారు . రాజ్యవర్ధన్ తో మొదలై విరాట్ కోహ్లి , హృతిక్ రోషన్ , అనుష్క శర్మ , సింధు , సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించిన వారిలో ఉన్నారు .

ఇప్పుడు ఈ ఛాలెంజ్ టాలీవుడ్ ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి చేరింది . అఖిల్ తన అన్న నాగచైతన్య కు ఫిట్నెస్ సవాలు విసిరిన సంగతి తెలిసినదే . అయితే దానికి నాగచైతన్య స్పందిస్తూ తను వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసారు . వీడియో పోస్ట్ చేస్తూ  సమంతకు , సుమంత్ కు , నిధి అగర్వాల్ కు సవాలు విసిరారు . దీని గురుంచి సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఒక క్యూట్ మెసేజ్ పోస్టు చేసారు . “హంఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ నాకు చాలా నచ్చింది . కళ్ళకు , మనసుకు చాలా తేలికగా అనిపిస్తోంది . చై నేను నీ సవాలును స్వీకరిస్తున్నాను . కానీ నువ్వు పోస్టు చేసిన వీడియో చూసి నేను అలసిపోయాను . కాబట్టి రేపు నేను నీ సవాల్ ను పూర్తి చేస్తాను ” అంటూ పోస్ట్ చేసారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments