శ్రీవారి నగల విషయంలో రామనదీక్షితులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసినదే . ఇప్పుడు ఈ టీటీడీ వివాదంపై ఎంపీ వరప్రసాద్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వరప్రసాద్  డిమాండ్ చేశారు. అయితే విచారణకు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆయన తెలిపారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే టీటీడీలో జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తిన రమణ దీక్షితులను తొలగించడం దారుణమని పేర్కొన్నారు.

 తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని , దీని వెనుక ఉన్న మతలబు ఏంటో చివరికి అధికారులకు కూడా తవ్వకాల గురించి తెలియదని చెబుతున్నారని అన్నారు . తిరుమల స్వామి వారి నగల మీద ఇ‍ప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ టీటీడీ వివాదంపై విచారణకు డిమాండ్‌ చేస్తుందన్నారు. రమణ దీక్షితులకు, తమకు ఎటువంటి  సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ నేత వరప్రసాద్‌ స్పష్టం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments