బీజేపీ అగ్రనేత , మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసినదే . అనేకమంది రాజకీయ నాయకులు దత్తాత్రేయ నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శించి వారి సానుభూతిని తెలియజేసారు . తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దత్తాత్రేయను ఓదార్చారు . ఈ వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని మోదీ పేర్కొన్నారు . వైద్య విద్య పూర్తి చేసి దేశానికి సేవ చేయవలసిన వైష్ణవ్ మృతి చెందడం బాధాకరమని అన్నారు . ఈ మేరకు దత్తాత్రేయ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ప్రధాని మోదీ లేఖ పంపించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments