కర్ణాటక ఎన్నికల తరువాత రాజకీయాలలో అనూహ్య పరిణామాలకు దారి తీసి చివరికి ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసినదే . అయితే పోయిన వారం యెడ్యూరప్ప బలపరీక్ష చేసుకోకుండానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు . అయితే ఇప్పుడు కుమారస్వామి విధానసభలో బలపరీక్ష చేస్కుకోవలసిన పరిస్థితి ఏర్పడింది .

ఈరోజు విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉండగా బీజేపీ తరపున నామినేషన్ వేసిన సురేష్ కుమార్ తన నామినేషన్ ను ఉపసంహరించుకావడంతో కాంగ్రెస్ అభ్యర్ధి రమేష్ కుమార్ ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికయ్యారు . బీజేపీ తమకు సభలో సంఖ్యాబలం లేకపోవడంతో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది . దీనిబట్టి చూస్తే విశ్వాసపరీక్షలో కూడా అంతిమ విజయం కుమారస్వామిదేనని భావించొచ్చు.  .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments