కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన తరువాత బలపరీక్ష నిరూపించుకునేందుకు విశ్వాసతీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు . ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదన్నారు . రాష్ట్రానికి హాంగ్ అసెంబ్లీ కొత్తేమీ కాదని, 2004 లోనూ హాంగ్ అసెంబ్లీ ఏర్పడిందని , ప్రత్యేక పరిస్థితులలో విశ్వాసపరీక్ష నిర్వహిస్తున్నామన్నారు . రాష్ట్ర సంక్షేమం మ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ , జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందని కుమారస్వామి పేర్కొన్నారు . తమ కుటుంబం పదవుల కోసం ఎన్నడూ పాకులాడలేదని స్పష్తం చేసారు . ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ కు కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments