ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పై అనేక వర్గాల ప్రజలు , సెలెబ్రిటీలు బీజేపీ పై మండిపడుతున్న విషయం తెలిసినదే . తాజాగా సినీ హాస్య నటుడు కిషోర్ దాస్ హనుమాన్ జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వైఖరిపై మండిపడ్డారు . వచ్చే ఎన్నికలలో బీజేపీ కి నూకలు చేల్లిపోతాయని అన్నారు . ఏపీకి ప్రత్యేక హోదా , విభజన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తున్న వారికి ప్రజలు గడ్డి పెడతారన్నారు . ఏపీ గురుంచి ప్రధాని మోదీ అనేక హామీలు ఇచ్చారని , ఆ తరువాత తుంగలో తొక్కారని అన్నారు . కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజిగాకవర్గాలలో బీజేపీకి ఓట్లు తక్కువగా రావడానికి ప్రత్యేక హోదా అంశమే కారణమని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ ఏపీ బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నారని . వచ్చే ఎన్నికలలో వారికి గడ్డుకాలం తప్పదని కిషోర్ దాస్ జోస్యం చెప్పారు . ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేలుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు . తెలుగు కోస్తా బిడ్డగా తాను తన ఆవేదనను తెలియజేస్తున్నానని అన్నారు . ఇప్పటికైనా ప్రత్యేక హోదా గురుంచి ఆలోచిస్తారనే అనుకున్తున్నానాని ఆశాభావం వ్యక్తం చేసారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments