ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమంది బీజేపీ వ్యతిరేక నాయకులతో కలిసి కూటమి ఏర్పరిచే ఆలోచనలో ఉన్నామని , వచ్చే ఎన్నికల సమయానికి కేంద్రం లో తాను చక్రం తిప్పుతానని చెప్పిన విషయం తెలిసినదే . ఈ విషయం పై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు . ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని విమర్శించారు . నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది తానేనని , ప్రధాని కూడా అయ్యే వాడినని చంద్రబాబు అంటున్నారని అవన్నీ రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని , ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నరసింహారావు అన్నారు . రెండు ఎకరాల నుండి అత్యంత సంపన్న సీఎం గా చంద్రబాబు ఎలా ఎదిగారో అందరికీ తెలుసని , త్వరలో ప్రజలు ముందు దోషిగా చంద్రబాబు నిలబడడం ఖాయమన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments