శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వ తండ్రి రంజన్ డిసిల్వను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. 62 ఏళ్ల రంజన్, గత రాత్రి 8.30 గంటల సమయంలో కొలంబోలోని దేహివాలా – మౌంట్ లావినియా ప్రాంతంలోని జ్ఞానేంద్ర రోడ్డులో ఉండగా, ఓ వ్యక్తి ఆయనపై తుపాకితో కాల్పులు జరిపాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని ఇంతవరకూ గుర్తించలేదని, కేసును విచారిస్తున్నామని అన్నారు. కాగా, తండ్రి హత్యతో నేడు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లార్సిన డిసిల్వ, తప్పుకున్నాడు. జూన్ 6 నుంచి శ్రీలంక జట్టు వెస్టిండీస్ తో మూడు టెస్టు మ్యాచ్ లను ఆడాల్సివుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments