ఇటీవల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, బ్యాట్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన వార్నర్‌.. తన ఇంట్లో జరిగిన మరో ఘటన తీవ్రంగా కలిచివేసింది. దానికి సంబంధించి వార్నర్‌ సతీమణి కాండిష్‌ వార్నర్‌ స్థానిక మహిళా వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సంఘటనలతో వార్నర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని ఆ విషాదం నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నించాడని ఆమె తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి తాము వచ్చిన తరువాత తమ జీవితంలో మరిచిపోలేని విషాద సంఘటన చోటు చేసుకుందని అన్నారు. ఒకరోజు తాను బాత్‌రూమ్‌లో ఉండగా తీవ్రంగా కడుపునొప్పి వచ్చిందని, సహాయం కోసం డేవిడ్‌ను పిలిచినట్లు తెలిపారు. అయితే తీవ్ర రక్త స్రావం జరగడంతో తన గర్భాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా ప్రయాణం చాలా కష్టంగా ఉంటుందని, పర్యటనకు ముందే తాను గర్భం దాల్చానని, వార్నర్‌ చాలా సురక్షితంగా తనను ఇంటికి తీసుకెళ్లాడని గుర్తు చేసుకున్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో నిషేధం కారణంగా తీవ్రంగా కుంగిపోయన వార్నర్‌ను తన గర్భస్రావం మరింత కలచివేసిందన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments