టైటిల్ : అమ్మమ్మగారిల్లు
జానర్ : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నాగశౌర్య, షామిలి, రావు రమేశ్‌, శివాజీ రాజా, సుమిత్ర, సుధ, హేమ తదితరులు
సంగీతం : కళ్యాణ్‌ రమణ
దర్శకత్వం : సుందర్‌ సూర్య
నిర్మాత : రాజేశ్‌

ఛలో సినిమాతో సక్సెస్‌ అందుకున్న యువహీరో నాగశౌర్య. ఈ కుర్ర హీరో ఛలో లాంటి మాస్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ తరువాతి చిత్రంగా కుటుంబ నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేసవి సెలవుల్లో అందరూ అమ్మమ్మ గారింటికి వెళ్తారు. అయితే నాగశౌర్య ఈ వేసవిలో ‘అమ్మమ్మ గారిల్లు’ కు వచ్చేలా చేశాడో లేదో తెలుసుకుందాం.

కథ :
రంగారావు (చలపతి), సీతా మహాలక్ష్మి (సుమిత్ర) గారిది పిఠాపురంలో ఓ పెద్ద కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు (రావు రమేశ్‌) తండ్రిని ఆస్తి పంచమని అడుగుతూ ఉంటాడు. ఆస్తి కంటే అనుబంధాలు గొప్పవి, ఆస్తిని విడగొడితే అందరూ దూరమవుతారని కొడుక్కు నచ్చజెపుతాడు తండ్రి. కానీ బాబురావు(రావు రమేశ్‌) వినడు. అలా ఓసారి  జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్‌)ను చేయిజేసుకుంటాడు బాబురావు. ఆ అవమానంతో సుమన్‌ తన మామగారి కుటుంబానికి దూరంగా ఉంటారు. అల్లుడు గారికి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో చలపతి చనిపోతాడు. కొడుకులు, కూతుళ్లు అందరూ సీతామహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. చిన్నప్పటి నుంచి సుమన్‌ కొడుకు సంతోష్‌ (నాగశౌర్య) కు మాత్రం అమ్మమ్మ అంటే చాలా ఇష్టం.

బలాలు : 
నాగశౌర్య, రావు రమేశ్‌ నటన
సంగీతం
కొన్ని డైలాగ్‌లు

బలహీనతలు :
కథలో కొత్తదనం లోపించడం

2.5/5

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments