ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అఖిలప్రియ ఇటీవల ఆమె నివాసంలో పారిశ్రామికవేత్త అయిన భార్గవ్ తో నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసినదే . అయితే తన పెళ్లికి రావాల్సిందిగా ఏపీ మంత్రి అఖిలప్రియ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఆమె వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ, భార్గవ్‌లకు మంత్రి కేటీఆర్ జ్ఞాపికను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్‌లో అఖిలప్రియ తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తాను 2009-2014 మధ్య శాసనసభ్యులుగా పనిచేశామని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 29న అఖిలప్రియ వివాహం జరగనుంది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments