ముందు తరంలో హీరోయిన్లు గా నటించిన వారు ఇప్పుడు తల్లిగా , అత్తగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించడం చూస్తున్నాం .  భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించారు ఆమని .  కథానాయకుడి పాత్రను లక్ష్యం దిశగా నడిపించే ఈ పాత్రలో ఆమని మరింతగా మెప్పించారు.  దీనితో ఆమెకు వరుస అవకాశాలు వస్తునట్టుగా తెలుస్తోంది .

దిల్ రాజు నిర్మాణంలో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకి ‘హలో గురు ప్రేమకోసమే’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వన్ తల్లి పాత్రకి ప్రాముఖ్యత ఉండటంతో ఆమనిని తీసుకున్నారట. ఈ సినిమాలో ఆమె భర్తగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments