1990 లలో  తలుగు , తమిళ బాషలలో అగ్రహీరోలందరితో నటించారు హీరోయిన్ సిమ్రాన్ . తెలుగు ఆమె చివరిగా నటించిన సినిమా “జాన్ అప్పారావు 40 ప్లస్” . ఈ సినిమా 2008 లో విడుదలైంది . దాని తరువాత ఆవిడ తమిళ సినిమాలకు పరిమితమయ్యారు . తమిళ సూపర్ స్టార్ రాజనీకంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్సకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసినదే . ఈ చిత్రం లో తలైవాకి జోడీగా తొలుత త్రిష , మీనాతో పాటు మరికొందరి పేర్లు వినిపించాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ఛాన్స్ సిమ్రాన్ కు వరించిందట. రజనీకాంత్ సినిమాలు ఎలాగా తెలుగులో విడుదలవుతాయి. కాబట్టి సిమ్రాన్ నటిస్తే పదేళ్ళ తరువాత తెలుగు ప్రేక్షకులకు ఆమెను వెండితెరపై చూసే అవకాశం కలగనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments