జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రజలకు సేవచేయకుండా ఉన్నందుకు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు . ఎంత మంది ఎన్నిరకాలుగా అడ్డుకున్నా తాను ముందుకు వెళ్తానని , అన్నిటికీ తెగించి రాజకీయాలలోకి వచ్చానని తెలిపిన విషయం తెలిసినదే .

ఇప్పుడు మెగా ఫాన్స్ కు , జనసేన కార్యకర్తలు ఇంకా తమలో విశ్వాసం పెంచే విషయం వెల్లడయ్యింది . మెగా పవర్ స్టార్ రాంచరణ్ సంచలన ప్రకటన చేశారు . హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ ను రిపోర్టర్ జనసేన గురుంచి అడగగా తాను జనసేన తరపున ప్రచారం చేయడానికి రెడీ గా ఉన్నానని బాబాయి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నానన్నారు . ప్రజారాజ్యం అప్పుడే పార్టీ తరపున ప్రచారం చేద్దామనుకున్నానని కాని అప్పుడు బాబాయి ఇప్పుడే వద్దన్నారు అని చెప్పారు . తన బాబాయి ప్రజలకోసం చాలా కష్టపడుతున్నారని తమ ఫ్యామిలీ ఎప్పుడూ బాబాయ్ కు సపోర్ట్ గా ఉంటామన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments