పూరి జగన్నాధ్ ఇటీవల రూపొందించిన చిత్రం మెహబూబా . తన తనయుడు కధానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ఆఫిస్ వద్ద అద్బుతమైన ఫలితాలు పొందలేకపోయింది .  మరుసటి చిత్రం కూడా తన కొడుకు ఆకాష్ తోనే తీస్తానని పూరీ ప్రకటించారు . ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ్ . అదే సమయంలో అగ్రహీరోలతో సినిమా చేయడానికి పూరి ప్రయత్నిస్తున్నారు . ఆ ప్రయత్నాలలో సీనియర్ హీరో నాగ్ కు ఒక కధ వినిపించారట .

మొదట చిరంజీవి తన 150 వ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్సకత్వం లో  తెరకెక్కించాలనుకున్న విషయం తెలిసినదే . పూరీ చెప్పిన కధ  సంతృప్తి గా అనిపించకపోవడంతో చిరు రీమేక్ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు . ఇప్పుడు ఇదే కధకు మార్పులు చేసి నాగార్జునకు వినిపించారట పూరీ . మరి నాగ్ ఈ కధకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్న విషయం వేచి చూడాలి .

గతంలో పూరీ , నాగ్ కాంబినేషన్లో సూపర్ , శివమణి సినిమాలు వచ్చి విజయాన్ని సాధించాయి . మరి మళ్ళీ వీళ్ళ జోడీ రిపీట్ అయ్యి విజయాన్ని సాదిస్తారేమో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments