దేవకట్టా దర్సకత్వంలో వచ్చిన అద్బుతమైన చిత్రం “ప్రస్థానం” . ఈ చిత్రం లో సాయికుమార్ తన అద్బుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు . ఎన్నో అవార్డులు , ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా టాలీవుడ్ లో ఈ సినిమాది ప్రత్యేక స్థానమే .

ఇప్పుడు ఈ ప్రస్తానం సినిమాను హిందీలో సంజయ్ దత్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా షూటింగ్‌ను తన తల్లి నర్గీస్‌ దత్‌ పుట్టిన రోజైన జూన్‌ 1న ప్రారంభిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగులో సాయికుమార్‌ పోషించిన పాత్రను సంజయ్‌దత్‌ పోషిస్తున్నట్లుగా తెలిపారు. బాలీవుడ్‌ నేటివిటికి తగ్గట్లు మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రీమేక్‌ కూడా దేవకట్టా దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది. అలీ ఫజల్‌, అమైరా దస్తూర్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments