ఆయనొక రాజకీయ ఊసరవెల్లి…

0
181

మైలవరం పట్టణంలో గురువారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది . ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమేమ్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు . ఒక పధకం ప్రకారమే కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపారని ఆయన ఆరోపించారు . నేడు ఏపీ సీఎం చంద్రబాబు తనపై ఉన్న కేసుల విషయంలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకుని స్టేలు తెచ్చుకున్నారన్నారు . కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు అభినందించడమే అందుకు నిదర్సనమన్నారు .

వైఎస్ జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టడంలో ప్రత్యక్షంగా , పరోక్షంగా చంద్రబాబే కారణమని , పైకి తేనె పూతలా ఉంటూ లోపల మాత్రం తేనె పూసిన కత్తిలా ఏపీ సీఎం ఉంటారని ఆరోపించారు . ఆనాడు కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్ పార్టీ పెడితే , పార్టీ సిద్దాంతాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు . చంద్రబాబు నయవంచకుడని ఎన్టీఆర్ అప్పుడే చెప్పారని , కుట్ర రాజకీయాలకు చంద్రబాబే నాయకుడని పెద్దిరెడ్డి అన్నారు .

వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు పిచ్చెక్కుతోందన్నారు . వైఎస్ జగన్ గురుంచి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు . జగన్ నిఖార్సయిన వ్యక్తనని , విలువలతో పోరాటం చేసే వ్యక్తని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు . ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నేతలు వసంత కృష్ణప్రసాద్ , సామినేని ఉదయభాను , జోగి రమేష్ , మెండితోక జగన్మోహనరావు మరియు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here